Wednesday, June 26, 2024
Homeసినిమాహాట్ స్టార్ లో అడుగుపెట్టిన 'యక్షిణి'

హాట్ స్టార్ లో అడుగుపెట్టిన ‘యక్షిణి’

పాత జానపద సినిమాలను చూస్తే, రాకుమారుడు తాను అనుకున్నది సాధించడం కోసం కొండలు .. కోనలు మాత్రమే కాదు, లోకాలు కూడా దాటిపోతాడు. అలా యక్ష లోకానికి వెళతాడు .. అక్కడ యక్షితల ను చూస్తాడు .. వాళ్లతో సరసాలు ఆడతాడు .. ఆటపట్టిస్తాడు .. అనుకున్నది చేజిక్కుంచుకుని అక్కడి నుంచి బయటపడతాడు. ఇలా జానపదాల నేపథ్యంలో యక్షితల ప్రస్తావన అప్పటి నుంచి మనకి కనిపిస్తూ వచ్చింది. వినోదాన్ని అందిస్తూనే వచ్చింది.

ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అందువలన తాము అనుకున్నది సాధించడం కోసం యక్షితలు భూమికపై రావడం కొత్తగా అనిపిస్తుంది. ఇక ఈ శోషియో ఫాంటసీకి హారర్ టచ్ ఇవ్వడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన వెబ్ సిరీస్ గా ‘యక్షిణి’ కనిపిస్తుంది. ‘వేదిక’ ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ నిర్మితమైంది. ఆర్కా మీడియా వర్క్స్ వారు నిర్మించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించనుంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో మంచు లక్ష్మి .. రాహుల్ విజయ్ .. అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలకాపురిలో ఉండే యక్షిణి, శాపవశాత్తు భూమిపైకి వస్తుంది. ఆ శాపం నుంచి విముక్తి కలగాలంటే ఆమె ఇక్కడ వందమందిని చంపాలి. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటుంది? ఆమె చేతిలో చనిపోనున్న 100వ వ్యక్తి ఎవరు? అనేదే ప్రధానమైన కథాంశం. ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్