Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్World Cup Hockey: ఆరంభ మ్యాచ్ లో అర్జెంటీనా విజయం

World Cup Hockey: ఆరంభ మ్యాచ్ లో అర్జెంటీనా విజయం

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్య్వర్యంలో ఓడిశాలో జరుగుతోన్న పురుషుల వరల్డ్ కప్ హాకీ -2023 పోటీలు నేడు మొదలయ్యాయి. ఆరంభ మ్యాచ్ లో అర్జెంటీనా 1-0 తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.

భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆట తొలి అర్ధభాగం వరకూ రెండు జట్లూ హోరాహోరీ తలపడ్డాయి, గోల్  సాధించలేకపోయాయి. మరో రెండు నిమిషాల్లో మూడో పావు భాగం ముగుస్తుందనగా 43వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు కసేల్లా మయాకో ఫీల్డ్ గోల్ ద్వారా బోణీ కొట్టాడు.

చివరి భాగంలో కూడా ఇరు జట్లూ నున్నా నేనా అన్నట్లు తలపడినా గోల్స్ చేయలేకపోయాయి. చివరకు విజయం అర్జెంటీనా ను వరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular