Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Ind Vs. SA T20: అర్ష దీప్ మ్యాజిక్- ఇండియా ఘనవిజయం

Ind Vs. SA T20: అర్ష దీప్ మ్యాజిక్- ఇండియా ఘనవిజయం

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి 20లో ఇండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ నిప్పులు చెరిగే బంతులతో 9 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కాకావికలం చేశారు. జట్టులో కేవలం ముగ్గురే కేశవ్ మహారాజ్-44; ఏడెన్ మార్క్రమ్-25; పార్నెల్-24…రెండంకెల స్కోరు చేశారు. మొత్తం నలుగురు (కెప్టెన్ బావుమా, రోస్సో, మిల్లర్, స్టబ్స్) డకౌట్ అయ్యారు. ఓపెనర్ డికాక్ కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీపక్ చాహర్ ఇన్నింగ్ మొదటి ఓవర్లోనే కెప్టెన్ బావుమాను అవుట్ చేశారు. రెండో ఓవర్లో హర్షల్ ఏకంగా మూడు వికెట్లు తీశాడు. దీపక్ తన రెండో ఓవర్లో మరో వికెట్ తీయడంతో కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అతి తక్కువ పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన చరిత్ర రాసుకుంది సౌతాఫ్రికా. అర్షదీప్, చాహర్ తో పటు హర్షల్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 9 పరుగులకు తొలి వికెట్ (రోహిత్ డకౌట్) కోల్పోయింది. కోహ్లీ కూడా కేవలం మూడు పరుగులే చేసి జట్టు స్కోరు 22 వద్ద పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్- సూర్య కుమార్ యాదవ్ లు మరో వికెట్ పడకుండా ఆడి జట్టును గెలిపించారు. రాహుల్ 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51;  సూర్య 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఇండియా లక్ష్యాన్ని చేరుకుంది.

ఆర్షదీప్ సింగ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్