Sunday, January 19, 2025
Homeసినిమా'ఆక్రోశం' డిసెంబర్ 16న విడుదల

‘ఆక్రోశం’ డిసెంబర్ 16న విడుదల

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్.  తమిళంలో జి.య‌న్‌.కుమార వేల‌న్ డైరెక్ష‌న్‌లో ఆర్‌.విజ‌య్ కుమార్  నిర్మించిన యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ రివేంజ్ డ్రామా ‘సినం’ను తెలుగులో ఆక్రోశం పేరుతో డిసెంబర్ 16న భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ మా ‘ఆక్రోశం’ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందోన‌ని ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్స్‌లో మూవీని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం అందుకే విడుదల తేదీని 9 నుంచి 16 కు మార్చాం. మ‌హిళ‌లు, అమ్మాయిలు, కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఈ సినిమాను ఎంత‌గానో ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. ఇదొక ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. చ‌క్క‌టి మెసేజ్ ఉంటుంది. ఏనుగు సినిమా స‌మ‌యంలో స‌తీష్‌ గారితో అనుబంధం ఏర్ప‌డింది. ఇప్పుడు ఆయ‌నే ఆక్రోశం సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్