ఐఎండీబీ సంస్థ ప్రతి సంవత్సరం చివరిలో హీరో, హీరోయిన్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను బట్టి ర్యాంకులు ప్రకటిస్తుంటుంది. ఈ సంవత్సరం మోస్ట్‌  పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జాబితాను ప్రకటించింది. మొదటి స్థానంలో తమిళ హీరో ధనుష్‌ నిలిచారు. అలియా భట్‌ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఐశ్యర్యా రాయ్‌ నిలిచింది. ఇక మన తెలుగు హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నాలుగోస్థానంలో నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తొమ్మిదో స్థానం లభించింది.

సమంత, హృతిక్‌ రోషన్‌, కియారా అడ్వాణీ ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. కేజీఎఫ్‌ 2 చిత్రంలో నటించిన యష్‌ తొలిసారిగా ఐఎండీబీలో ఖాతా తెరిచారు. ఆయనకు పదో ర్యాంక్‌ లభించింది. ఐఎండీబీ ర్యాంకుల్లో దక్షిణాది తారల హవా స్పష్టంగా కనిపిస్తుండడం.. అందులోనూ మన టాలీవుడ్ స్టార్స్ ఎక్కువుగా కనిపిస్తుండడం ఈసారి విశేషం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అందుచేత ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌… ఈ లిస్టులో చోటు ద‌క్కించుకున్నారు.

స‌మంత ఈ యేడాదంతా.. ఫుల్ జోష్‌లో ఉంది. అందుకే త‌న‌నీ ఐఎండీబీ గుర్తించింది. పుష్ప‌తో బ‌న్నీ హ‌వా దేశ‌మంతా క‌నిపించింది. ఇప్పుడు రష్యాలో పుష్ప సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అందుకే త‌ను కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ధ‌నుష్ ఎప్ప‌టి నుంచో పాన్ ఇండియా స్థార్‌. త‌న సినిమాలన్నీ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకొంటున్నాయి. సో.. త‌న‌కు టాప్ 1 ద‌క్క‌డం వింతేం లేదు. కాక‌పోతే.. ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్లు ఈ లిస్టులో లేక‌పోవ‌డం ఆయా హీరోల అభిమానుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. వచ్చే సంవత్సరం ప్రభాస్ ఆదిపురుష్‌, సలార్, విజయ్ దేవరకొండ ఖుషి సినిమా రిలీజ్ అవుతుంది. మరి.. నెక్ట్స్ ఇయర్ ఈ ఇద్దరు లిస్ట్ లో చేరతారేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *