Wednesday, March 11, 2026
HomeTrending Newsఆర్యన్ కు బెయిల్

ఆర్యన్ కు బెయిల్

ఆర్యన్ ఖాన్ కు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ తో పాటు అరెస్టయిన మరో ఇద్దరు  నిందితులు అర్బాజ్ ఖాన్, మున్ మున్ దమేచాలకు కూడా బెయిల్ లభించింది. ముంబై క్రూజ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు, ముంబై పోలీసులు ఈనెల 3న దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడైన ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆర్యన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టు ఆదేశాలతో ముంబై లోరు ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు, 26 రోజులనుంచి అయన జైలు జీవితం గడుపుతున్నారు. ఆర్యన్ కు బెయిల్ కోసం షారుఖ్ ఎంతో ప్రయత్నించారు. గతంలో రెండుసార్లు సెషన్స్ కోర్టు ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. రెండ్రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు బొంబాయి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ తరఫున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు.

అయితే ఆర్డర్ కాపీ అందడం ఆలస్యం కానుంది, దీనితో ఆర్యన్ నేడు విడుదలయ్యే ఆవకాశం లేదు. సమగ్ర తీర్పును బొంబాయి హైకోర్టు రేపు వెలువరించనుంది, రేపు సాయంత్రం లేదా శనివారంనాడు ఆర్యన్ విడుదల కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular