రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకొని రాణించడంతో బంగ్లాదేశ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇండియా 3 వికెట్ల తేడాతో గట్టెక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 35 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 56 పరుగుల వద్ద జయ్ దేవ్ ఉనాద్కత్ వికెట్ కోల్పోయింది. రిషభ్ పంత్ పై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. కేవలం 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే అక్షర్ పటేల్ (34) కూడా ఔటయ్యాడు, 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్ అయ్యర్- రవిచంద్రన్ అశ్విన్ లు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు. అశ్విన్ 42 (62 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్); అయ్యర్-29 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ ఐదు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు సాధించారు.
అశ్విన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్, పుజారా కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.