Saturday, January 18, 2025
HomeసినిమాPushpa 3: 'పుష్ప 3' కూడా ఫిక్స్ అయ్యిందా..?

Pushpa 3: ‘పుష్ప 3’ కూడా ఫిక్స్ అయ్యిందా..?

అల్లు అర్జున్, సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2, ‘పుష్ప’ చిత్రాలు రూపొందాయి. అయితే..ఒక ఎత్తు అయితే.. పుష్ప చిత్రం మరో ఎత్తు. ఇద్దరికీ పుష్ప ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. దీంతో ‘పుష్ప 2’ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో పుష్ప 2 పై మరింత క్రేజ్ ఉండడం విశేషం. ఇటీవల పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టడంతో ఎంత క్రేజ్ ఉందో అర్ధం అవుతుంది.

ఇదిలా ఉంటే… పుష్ప 2 స్టార్ట్ కాకుండానే పుష్ప 3 ప్లాన్ జరుగుతుందనే వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ఫాహిద్ ఫాజిల్ ఓ ఇంటర్ వ్యూలో పుష్ప పార్ట్ 3 గురించి చెప్పడంతో కొన్ని రోజుల క్రితమే ఇది లీకైంది. అయితే.. ఇప్పుడు మరోసారి పుష్ప 3 గురించి ప్రచారం మొదలైంది. సుకుమార్ ఖచ్చితంగా పుష్ప 3 తీయాలని ఫిక్స్ అయ్యారట. దీనికి సంబంధించిన కథ కూడా రెడీ చేశారట కానీ.. పుష్ప 2 రిలీజైన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తారా..? లేక కొంత గ్యాప్ ఇస్తారా అనేది తెలియాల్సివుంది.

కారణం ఏంటంటే… పుష్ప 2 తర్వాత సుకుమార్.. రామ్ చరణ్‌, విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అందుచేత పుష్ప 3 ఎప్పుడు ఉంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరో విషయం ఏంటంటే… పుష్ప కాన్సెప్ట్ తో భారీగా వెబ్ సిరీస్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్