Sunday, January 19, 2025
HomeTrending Newsఆ వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ

ఆ వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ

ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫ్యకీరప్ప వెల్లడించారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన i-TDPofficial  సోషియల్ మీడియా  నుండి వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్  న్యూడ్ వీడియో పై ఫోరెన్సిక్ రిపోర్ట్ పై ఫక్కీరప్ప ప్రెస్ మీట్ నిర్వహించారు.

వీడియో రికార్డ్ చేసిన బాధితులు ఎవ్వరూ ఇప్పటి దాకా కంప్లైంట్ ఇవ్వలేదని, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసి వారి వద్ద ఉన్న ఒరిజినల్ వీడియో ఇస్తే… ఆ వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించి అప్పుడే నిర్ధారించగలమని స్పష్టం చేశారు. ఒరిజినల్ వీడియో దొరక్కపోతే ఈ వీడియో నిజమైనదో కాదో తేల్చలేమని ఎస్పీ  చెప్పారు.  ఒరిజినల్‌ వీడియో అత్యంత కీలకమని, అది లభ్యమైతే FSL  కి పంపుగలుగుతామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను తొలిసారి పోస్ట్ చేసిన నంబర్ ఇంటర్నేషనల్ నంబర్ కావడం వల్ల ఆ వ్యక్తి వివరాలు సేకరించే విధంగా తదుపరి దర్యాప్తు చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్