Monday, July 20, 2026
Homeసినిమా'స్వాతిముత్యం' అక్టోబర్ 5న విడుదల

‘స్వాతిముత్యం’ అక్టోబర్ 5న విడుదల

గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం‘. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి విడుదల తేదీ ఖరారు చేస్తూ ప్రచార చిత్రం ఈరోజు విడుదల చేశారు. స్వాతిముత్యం అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత  అధికారికంగా ప్రకటించారు.

స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథే ఈ చిత్రం.  జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది కథాంశం.  కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం’స్వాతిముత్యం’ అని దర్శకుడు లక్ష్మణ్ వివరించారు.

చిత్ర ప్రచారం కూడా సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ, ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల విడుదల అయిన “నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా” గీతం తో పాటు ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అంటోంది చిత్ర బృందం.

Also Read చారెడు కళ్ళు చదివేస్తున్న బెల్లంకొండ గణేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular