కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటయ్యాక లాద్దాక్ లో ఉగ్రవాదం తగ్గిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. స్థానిక పొలిసు యంత్రాంగం, మిలిటరీ బలగాలు సమన్వయంతో పని చేసి టెర్రరిస్ట్ గ్రూపుల్ని లద్దాక్ వైపు చూడకుండా చేశారన్నారు. లద్దాక్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి లెహ్ లో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టిన 63 ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ నుంచి వేరు చేశాక లద్దాక్ లో ప్రశాంతత పరిస్థితులు నేలకొన్నాయన్నారు.
కశ్మీర్, లద్దాక్ విభజన రాజకీయ స్వలాభం కోసమని ప్రధానమంత్రి ని అనేక మంది విమర్శించారని రక్షణ మంత్రి తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే రాజకీయ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీలతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొందరలోనే లద్దాక్ నేతలతో కూడా భేటీ అవుతారని వెల్లడించారు. సరిహద్దుల్లో సైన్యం సేవల్ని కొనియాడిన రక్షణ మంత్రి లొంగిపోయిన ఉగ్రవాదులకు పునరావాసం కల్పించటం గొప్ప విషయమని ప్రశంసించారు.