Movie Stalled? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అయితే… సుమారు రెండేళ్లు అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇంకా నత్త నడకనే నడుస్తుంది. దాదాపు 50 శాతం మేర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని క్రిష్ ఎంత ప్రయత్నించినప్పటికీ.. షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అయితే.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత కంప్లీట్ గా వీరమల్లు లుక్ నే ఇప్పటి వరకు మైంటైన్ చేశారు. తాజాగా బయటకి వచ్చినపుడు పవన్ వీరమల్లు లుక్ లో కనిపించలేదు.
క్రాప్ చేయించేసి మీసకట్టు కూడా మార్చేయడం ఆసక్తిగా కనిపిస్తుంది. నార్మల్ లుక్ లోకి వచ్చేసిన పవన్ ఇప్పుడప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేసే యోచనలో లేనట్టే అనిపిస్తుంది. అలాగే మరో పక్క మరో రీమేక్ కి పవన్ కాల్షీట్స్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. దీంతో మరోసారి వీరమల్లు ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై పవన్ కానీ.. క్రిష్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read : ‘హరిహర వీరమల్లు’ తో దర్శక నిర్మాతల చర్చలు