Saturday, January 18, 2025
Homeసినిమాఅనుకున్న సమయానికే “ఆర్.ఆర్.ఆర్.”

అనుకున్న సమయానికే “ఆర్.ఆర్.ఆర్.”

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్ లో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ సంచలన చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వలన వాయిదా పడుతూనే ఉంది.  2021లో దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ దసరాకి ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు.

అయితే.. కరో్నా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈసారి కూడా చెప్పిన డేట్ కి రావడం లేదు. ఆర్ఆర్ఆర్ 2022లో సంక్రాంతికి కానీ.. సమ్మర్ కి కానీ విడుదల కానున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇక ఆర్ఆర్ఆర్ ఈ సంవత్సరంలో విడుదల కాదని ఫిక్స్ అయ్యారు. అయితే.. రాజమౌళి ఈ రోజు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తుంటే.. వెనక అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్ కూర్చొన్నారు. మెగా హీరో నందమూరి హీరో ఇలా ఓకే ఫోటోలో కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

ఈ పోస్ట‌ర్ పై ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబరు 13 న విడుద‌ల అని ఉంది. దీనిని బట్టి జక్కన్న ఈ చిత్రాన్ని ముందుగా చెప్పినట్లుగా అక్టోబర్ 13నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారనిపిస్తుంది. చెప్పిన తేదీకే విడుదల చేయాలని నిర్ణయించి జక్కన్న అందరికీ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్