Thursday, March 28, 2024
Homeసినిమావెంక‌టేష్ ‘నార‌ప్ప’ కు U /A సర్టిఫికేట్.

వెంక‌టేష్ ‘నార‌ప్ప’ కు U /A సర్టిఫికేట్.

Venkatesh Narappa Completed Censor Process Got U/A Certificate :

హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీకెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు. వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్లతో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టినరోజు సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే త‌న అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. వెంకటేష్‌ను ఇంత‌ వ‌ర‌కూ మ‌నం చూడ‌ని ఒక కొత్త‌ అవతారంలో చూపించ‌నున్నారు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే ఆయ‌న మేకింగ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ కానుంది.

Must Read : అతను ‘మా’వోడు కాదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్