Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీకి ఆ ముగ్గురిలో ఎవరు?

ఎన్టీఆర్ మూవీకి ఆ ముగ్గురిలో ఎవరు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ మూవీ రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత వీరిద్దరు కలిసి చేసే సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే.. ఈ భారీ క్రేజీ మూవీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ని ఎంపిక చేయనున్నారని.

ఇప్పటి వరకు కొరటాల శివ చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించేవారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ఆచార్యకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్ కు ట్రెమండ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఎన్టీఆర్ తో చేయనున్న మూవీకి సంగీత దర్శకుడుగా దేవిశ్రీ, మణిశర్మ, అనిరుథ్.. ఈ ముగ్గురులో ఎవర్ని తీసుకోవాలి అని కొరటాల ఆలోచనలో పడ్డారట. అనిరుథ్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఎన్టీఆర్ మూవీకి మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే ఛాన్స్ ను అనిరుథ్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్