Tuesday, June 30, 2026
Homeసినిమాప‌ర‌శురామ్ కి బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్?

ప‌ర‌శురామ్ కి బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  పుష్ప 2 రెండ్రోజుల క్రితం లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే.  అయితే.. బ‌న్నీ తర్వాతి సినిమా ఏమిటనే దానిపై ఇంకా స్పస్థత రాలేదు. ఆయనతో  సినిమా చేసేందుకు బోయ‌పాటి, మురుగుదాస్, కొర‌టాల‌, లైన్ లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ బ‌డా ఫిల్మ్ మేక‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ కూడా ఇంట్ర‌స్ట్ చూపించారు. ఆమ‌ధ్య బ‌న్నీ, భ‌న్సాలీ ఇద్ద‌రూ క‌ల‌వ‌డం కూడా జ‌రిగింది. ఇదిలా ఉంటే.. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా ప‌ర‌శురామ్ పేరు చేరింది. అవును.. బ‌న్నీతో ప‌ర‌శురామ్ ఎప్ప‌టి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాడు.  అసలు ‘గీత గోవిందం’ బ‌న్నీతోనే చేయాల్సి ఉండగా కుదరలేదు.

ఇటీవ‌ల బ‌న్నీకి ప‌ర‌శురామ్ మెడిక‌ల్ మాఫియా నేప‌ధ్యంలో సాగే క‌థ‌ను వినిపించాడ‌ట‌. స్టోరీ లైన్ బాగుంది పూర్తి క‌థ‌ను రెడీ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ప‌ర‌శురామ్ నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయాలి కానీ.. ఈ సినిమా ఉందో లేదో క్లారిటీ లేదు. అందుచేత బ‌న్నీ కోసం ఫుల్ స్టోరీ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట ప‌ర‌శురామ్. మ‌రి.. పుష్ప 2 త‌ర్వాత బ‌న్నీ ప‌ర‌శురామ్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.

Also Read : పుష్ప 2 టార్గెట్ ఏమిటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular