Saturday, January 18, 2025
Homeసినిమావెంకీ, నాగ్ ప్రాజెక్ట్ ని చిరు చేయ‌నున్నారా..?

వెంకీ, నాగ్ ప్రాజెక్ట్ ని చిరు చేయ‌నున్నారా..?

Stars Changed: మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన మూవీ బ్రో డాడీ. మోహన్ లాల్, పృధ్విరాజ్ సుకుమారన్ తండ్రీ కొడుకులుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ బ్రోడాడీ. ఈ మూవీకి పృధ్విరాజ్ దర్శకత్వం వ‌హించారు. తండ్రీ, కొడుకులిద్దరూ ఒకేసారి తండ్రి అవడంతో వారిద్దరికీ అనుకోని సమస్యలు ఎదురవుతాయి. చివరికి వారు దాన్నుంచి ఎలా బైటపడతారు? అన్నదే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేష్, రానా చేయ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఆత‌ర్వాత వెంక‌టేష్, రానా కాదు.. నాగార్జున‌, అఖిల్ చేయ‌నున్న‌ట్టుగా టాక్ వ‌చ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ లో న‌టించాలి అనుకుంటున్నార‌ట‌. ఇక చిరు కొడుకు పాత్ర‌లో మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌నున్నార‌ని వినిపిస్తోంది. అంతే కాకుండా.. ఈ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ను గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంతా క‌న్ ఫ‌ర్మ్ అన్న‌ట్టుగా టాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే… ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : నేను చేయాల్సింది నా తమ్ముడు చేస్తున్నాడు: చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్