Sunday, January 19, 2025
Homeసినిమాహ‌రీష్ శంక‌ర్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మెగాస్టార్.?

హ‌రీష్ శంక‌ర్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మెగాస్టార్.?

Gabbar Acharya: డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ‘గ‌బ్బ‌ర్ సింగ్’ మూవీని తెర‌కెక్కించి.. బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌ళ్లీ ప‌వ‌ర్ స్టార్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూశారు. అభిమానుల కోరిక‌కు త‌గ్గ‌ట్టుగానే.. వీరి  కాంబినేష‌న్లో మూవీ సెట్ అయ్యింది కానీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉంటే.. అటు యూత్ .. ఇటు మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీష్‌ శంకర్ కనిపిస్తాడు. లవ్, యాక్షన్, ఎమోషన్,  కామెడీ.. ఇలా అన్ని అంశాలు తన సినిమాల్లో ఉండేలా ఆయన చూసుకుంటాడు. పవన్ తో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ త‌ర్వాత చిరంజీవి ఒక ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మలయాళంలో ఈ జనవరిలో వచ్చిన బ్రో డాడీ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది.

మోహన్ లాల్..  పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ లో వెంకీ, రానా కానీ.. వెంకీ, నాగ‌చైత‌న్య కానీ.. నాగార్జున‌, అఖిల్.. కానీ న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజా వార్త ఏంటంటే.. చిరంజీవి న‌టించ‌నున్నార‌ని.. ఈ సినిమా బాధ్యతలను హరీష్‌ శంకర్ కి అప్పగించినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. హ‌రీష్ శంక‌ర్ కి బంప‌ర్ ఆఫ‌రే.

Also Read : చిరంజీవి సార్ .. యూ ఆర్ ఏ ట్రూ మెగాస్టార్ : రాజ‌మౌళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్