Sunday, January 19, 2025
Homeసినిమాఅక్టోబర్ నుంచి ప్ర‌భాస్, మారుతి మూవీ?

అక్టోబర్ నుంచి ప్ర‌భాస్, మారుతి మూవీ?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవ‌ల స‌లార్ షూటింగ్ లో పాల్గొన్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌భాస్, దీపికా ప‌డుకునే పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్, మారుతి కాంబినేష‌న్లో ఓ మూవీ రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదాప‌డుతూ వ‌చ్చింది. మారుతి ఇటీవ‌ల గోపీచంద్ తో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీని తెరెక్కించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌భాస్, మారుతి మూవీ ఉండ‌దు అనే టాక్ వినిపించింది. అభిమానులు అయితే.. మారుతితో మూవీ వ‌ద్దు అని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.

ఈ మూవీ అంశం మ‌రోసారి తెర పైకి వచ్చింది. అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డివివి దాన‌య్య నిర్మిస్తార‌ని తెలిసింది. మ‌రి.. ఈ ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ తో ప్ర‌భాస్ ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో.. మారుతి ప్ర‌భాస్ ని ఎలా చూపిస్తాడో చూడాలి.

Also Read : మారుతి కాస్తంత కసరత్తు చేయవలసిందే! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్