Thursday, March 28, 2024
Homeసినిమాబాలయ్య-రవితేజ కాంబినేషన్ లో మలినేని మూవీ?

బాలయ్య-రవితేజ కాంబినేషన్ లో మలినేని మూవీ?

నంద‌మూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 107వ సినిమా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. ప్రస్తుతం ఈ భారీ చిత్రం సెట్స్ లో ఉంది. రాయ‌ల‌సీమ‌లో ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

డైరెక్టర్ గత  కమర్షియల్ సక్సెస్ లు చూసి బాలయ్య ఇచ్చిన అవకాశమిది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా గోపీచంద్ మలినేని పై ఉంది.  ప్రస్తుతం వీరి కాంబో లో రూపొందుతోన్న  ‘బాలయ్య 107’ సెట్ లో ఉండగానే మరో సినిమాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే అవుననే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది బాలయ్య సోలో హీరోగా కాకుండా…  భారీ, క్రేజీ మల్టీస్టారర్ గా ఆ చిత్రాన్ని మలిచే అవకాశం ఉందని టాక్ బ‌లంగా వినిపిస్తుంది.

బాల‌య్య‌తో మ‌లినేని గోపీచంద్ వ‌ర్క్ చేస్తున్నారు. ర‌వితేజ ఆల్రెడీ వ‌ర్క్ చేశారు. వీరిద్ద‌రిని ద‌గ్గ‌ర నుంచి చూశారు కాబ‌ట్టి.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ చేస్తే బాగుంటుంద‌ని త‌న టీమ్ తో చెప్పి ఓ స్టోరీ రెడీ చేయించార‌ట‌. బాల‌య్య 107 మూవీ కంప్లీట్ అయిన త‌ర్వాత ఆ క‌థ‌ను ఇద్ద‌రికీ చెప్పాలి అనుకుంటున్నాడ‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ సెట్ అవుతుంది. అదే క‌నుక జ‌రిగితే.. ఈ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్