అత్యంత ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివ బాలాజీ ఎన్నికయ్యారు. అయితే వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వీరిద్దరూ మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు. నాగినీడుపై శివ బాలాజీ ౩౩ ఓట్లతో విజయం సాధించగా, రఘుబాబు, జీవితపై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి విష్ణు ప్యానెల్ నుంచి పది మంది, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది ఆధిక్యంలో ఉన్నట్లు తెలిసింది.