Monday, June 8, 2026
HomeTrending News‘మా’ ఎన్నికల్లో కురిసిన ‘మంచు’

‘మా’ ఎన్నికల్లో కురిసిన ‘మంచు’

అత్యంత ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నికల్లో మంచు విష్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ పై దాదాపు 400 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆఫీసు బేరర్లలో ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి,; జాయింట్ సెక్రటరీగా, గౌతం రాజు, కోశాధికారిగా శివ బాలాజీ ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ గా ఉత్తేజ్, ఉపాధ్యక్షుడిగా బెనర్జీ ముగ్గురు ఎన్నికయ్యారు. కోశాధికారిగా నాగినీడుపై శివ బాలాజీ ౩౩ ఓట్లతో విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు జీవితపై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎక్కువమంది ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించగా, విష్ణు ప్యానెల్ నుంచి కేవలం ఏడుగురు మాత్రమే గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular