Wednesday, March 18, 2026
Homeసినిమాపుష్ప-2లో రెండో హీరోయిన్?

పుష్ప-2లో రెండో హీరోయిన్?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్  డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ లో 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేయ‌డంతో పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సుకుమార్ క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు. ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి  సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే స్టోరీ గురించి వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… పుష్ప‌ పార్ట్ 1 లో ని కీలక పాత్ర భన్వర్ సింగ్ షెకావత్ కోసం ముందు తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఆ స్థానంలో మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ నటించారు. అయితే.. పార్ట్ 2 కోసం  ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం మళ్లీ విజయ్ సేతుపతినే పుష్ప టీమ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన మ‌రో వార్త బయటికి వచ్చింది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు ఓ చెల్లెలు వుంటుందట‌. ఆమెను సెకండ్ హీరోయిన్ గా రంగంలోకి దింపాల‌నుకుంటున్నాడ‌ట సుక్కు. భన్వర్ సింగ్ పాత్రకు, పుష్పకు మధ్య ఉండే సెకండ్ హీరోయిన్ పాత్ర‌ను అడ్డుపెట్టుకుని ఫహద్ పాత్రని బన్నీఓ ఆటాడుకుంటాడని టాక్.

Also Read : విదేశాల్లో పుష్ప-2?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular