Saturday, July 27, 2024
Homeసినిమావిదేశాల్లో పుష్ప-2?

విదేశాల్లో పుష్ప-2?

Foreign Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ మూవీ ఊహించ‌ని విధంగా బాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సోష‌ల్ మీడియాలో పుష్ప హవా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా పుష్ప 2 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించేలా సుకుమార్ క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు. బ‌న్నీ… ఎంత ఆల‌స్యం అయినా ఫ‌ర‌వాలేదు. స్టోరీ అదిరిపోవాలి అని చెప్పాడ‌ట‌.

ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుందని స‌మాచారం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. పుష్ప సినిమాను చాలా వరకూ మారేడుమిల్లి, రంపచోడవరం ఫారెస్టులో అలాగే కేర‌ళ‌లో చిత్రీకరించారు. అడవిలో చిత్రీకరించిన ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఫారిన్ లో అనుకున్నప్పటికీ, కోవిడ్ నిబంధనల కారణంగా అక్కడికి వెళ్లలేకపోయారు.

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాను మాత్రం, ఇండొనేషియా, సింగపూర్లలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది చివ‌రిలో కానీ.. 2024లో కానీ  ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రి.. పుష్ప 2 ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : పుష్ప 2 కోసం.. సుకుమార్ భారీ ప్లాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్