FIR: చిరంజీవి -చరణ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆచార్య‘ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఇంతవరకూ తన ప్రతి సినిమాలోను ఒక్కో సమస్యను గురించి ప్రస్తావిస్తూ వచ్చాననీ, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ సినిమాలో ఉంటుందంటూ కొరటాల మరింత ఆసక్తిని రేకెత్తించాడు. చిరంజీవి – చరణ్ కలిసి ఎక్కువ సేపు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక విశేషమైతే, ఇద్దరూ నక్సల్స్ డ్రెస్ లో కనిపించడం మరో విశేషంగా అనిపిస్తుంది. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, పబ్లిక్ టాక్ ను బట్టి చూస్తే ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే అర్థమవుతోంది.
థియేటర్స్ లో నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు కథాకథనాల పట్ల అంతగా సంతృప్తిని వ్యక్తం చేయకపోవడం గమనించదగిన విషయం. మెగాస్టార్ రేంజ్ కి తగినట్టుగా ఈ కథ లేదనీ .. మాస్ ఆడియన్స్ ఆయనను ఎలా చూడాలనుకుంటారో అలా చూపించడంలో కొరటాల సక్సెస్ కాలేకపోయారని అంటున్నారు. చిరూ డైలాగ్స్ ను కూడా కొరటాల పవర్ఫుల్ గా రాసుకోకపోవడం ఒక వెలితిగా అనిపిస్తోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం .. ట్విస్టులు లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
చరణ్ పాత్ర సంగతి అంటుంచింతే డాన్సులలో .. ఫైట్లలో తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. చిరంజీవి సరసన కాజల్ లేదన్నారు సరే .. చరణ్ జతగా తీసుకున్న పూజ హెగ్డే పాత్రకి కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక బలమైన విలన్ ను బరిలో ఉంచకుండా .. అంతకుమించి రంగంలోకి దింపడం, ఎవరూ చిరంజీవికి తగినవారు కాకపోవడం మైనస్ అయిందని అంటున్నారు. ఈ సినిమాకి ఫొటోగ్రఫీ .. మణిశర్మ స్వరపరిచిన పాటలు .. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంతవరకూ ఈ సినిమాను ఆదుకున్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పూజ హెగ్డే ఆశలన్నీ ‘ఆచార్య’ పైనే!