Pooja-Acharya: టాలీవుడ్లో పూజ హెగ్డే హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతోంది. తమిళ .. హిందీ భాషల్లో అదే స్థాయిని అందుకోవడానికి ఆమె తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ‘ రాధేశ్యామ్’ సినిమా చేసింది. ఇది పాన్ ఇండియా సినిమా. ఏ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయినా, మిగతా భాషల నుంచి కూడా తనకి అవకాశాలు వస్తాయని పూజ భావించింది. ఒక్కో భాషలో ఒక్కో సినిమాను ఒప్పుకోవడం కంటే, ఇలాంటి సినిమా ఒక్కటి చేస్తే చాలనే అనుకుంది. పైగా ప్రభాస్ హీరో కావడం వలన, హిట్టు బెట్టు చేయకుండా వెంటపడి వచ్చేస్తుందని ఆశించింది.

కానీ అలా జరగలేదు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, ‘రాధే శ్యామ్’ నిరాశపరిచింది. ఒక్క తెలుగులోనే కాదు .. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. అయితే పూజ హెగ్డే పూర్తిగా డీలాపడలేదు. దగ్గరలోనే ‘బీస్ట్’ రిలీజ్ ఉంది గనుక, ఆ సినిమా హిట్ కొంతవరకూ కవర్ చేస్తుందని భావించింది. విజయ్  హీరోగా రూపొందిన ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ‘అరబిక్ కుతు’ సాంగ్ చూసిన వాళ్లంతా ఈ సినిమా హిట్ కావడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఫలితం ఆమెను నిరాశపరిచింది.

ఇక ఇప్పుడు పూజ ముందున్న భారీ సినిమా ‘ఆచార్య‘ మాత్రమే. ప్రస్తుతం ఆమె ఉన్న పొజీషన్ ను కాపాడే సినిమా ఇదొక్కటే. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె చరణ్  జోడీగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ‘నీలాంబరి’ పాత్రను పోషించిందనే సంగతి ఆడియన్స్ కి తెలుసు. ఆమె వైపు నుంచి వచ్చిన ‘నీలాంబరి’ సాంగ్ కూడా హిట్ అయింది. అందువలన ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఈ నెల 29వ తేదీ కోసం అందరికంటే ఆసక్తితో ఆమె ఎదురుచూస్తోంది. ఈ సినిమా ఆమె నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి మరి!

Also Read : ఆచార్య ప్రీ రిలీజ్ వేదిక మారిందా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *