Tuesday, April 16, 2024
HomeTrending Newsమహానాడు వరకూ ‘బాదుడే బాదుడు’: చంద్రబాబు

మహానాడు వరకూ ‘బాదుడే బాదుడు’: చంద్రబాబు

Babu to Tour: ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహిస్తామని, ఆ తర్వాతా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తానని ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.  మే నెల మొదటి వారం నుంచి తన పర్యటనలు మొదలవుతాయని మహానాడు తర్వాత పెద్దఎత్తున  పర్యటనలు ఉంటాయని తెలిపారు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా ప్రతినిధులతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అయన పలు అంశాలను పంచుకున్నారు.

  • ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత లేదు చరిత్రలో చూడలేదు.
  • ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు…పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు.
  • టిడిపి అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదు
  • జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
  • ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు…జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి
  • రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసిపికి పడే చాన్స్ లేదు.
  • రైతు భరోసా పేరుతో రైతులకు ఏడాదికి 7 వేలు ఇచ్చి…ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారు.
  • రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదు….కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు.
  • పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టిడిపిపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారు.
  • వైసిపి ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదని, అనేదే జగన్ ఫ్రస్టేషన్ కు కారణం.
  • జగన్ ఫ్రస్టేషన్ లోనే అతని భాషమారింది…..క్యాబినెట్ విస్తరణ తో జగన్ బలహీనుడు అని తేలిపోయింది.
  • ఒత్తిళ్లతో సగంమందిని క్యాబినెట్ లో తిరిగి కొనసాగించారు…..దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయి.
  • క్యాబినెట్ విస్తరణ అనంతరం బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదు.
  • భవనం వెంకట్రామ్ కు కూడా ఇంత బలహీనంగా కనిపించలేదు.
  • నా ఇంటి మీద దాడికి వచ్చిన వారికి….లోకేష్ ను దూషించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు.
  • మంత్రి పదవులు పొందడానికి ఇదేనా అర్హత.
  • ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంన్నాం
  • బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటం లో ను పాల్గొంటాను…మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుంది.

Also Read :కేంద్రం జోక్యం చేసుకోవాలి: గోరంట్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్