కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితు లయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్రపతి భవన్ ఇంకా ధ్రువీకరించలేదు. మొన్నటి వరకూ కేంద్ర న్యాయశాఖ, ఐటి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండ్రోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రక్షాలనలో భాగంగా అయన ఉద్వాసనకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటి పాలసీ విషయంలో, ట్విట్టర్ వ్యవహారంలో అయన పనితీరు విమర్శలకు గురైంది. దీనివల్లే అయన పదవి కోల్పోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి.
అయితే ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె విజయం సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో అక్కడ క్రియాశీలకంగా ఉండే, బిజెపికి విధేయంగా వ్యవహరించే వ్యక్తిని గవర్నర్ గా నియమించాలని కేంద్ర పెద్దలు భావించారని, అందుకే రవిశంకర్ ప్రసాద్ ను తమిళనాడు పంపుతున్నారని తెలుస్తోంది.