Thursday, June 11, 2026
Homeసినిమారా ఏజెంట్ గా ప్రభాస్?

రా ఏజెంట్ గా ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. భారీ పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జులై 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు పూర్తైన తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేయనున్న సినిమాను ప్రారంభించాలి అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే… ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ చిత్రం చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఆ చిత్రం సెట్స్ పైకి రావడానికి చాలా సమయం ఉంది. అయినా స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని తెలుస్తోంది. కథ, అందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది ప్రభాస్‌కు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ వివరించారని.. ఇందులో ప్రభాస్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో పఠాన్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular