Friday, March 20, 2026
HomeTrending NewsJr. NTR: తాత జయంతి వేడుకలకు జూనియర్ దూరం!

Jr. NTR: తాత జయంతి వేడుకలకు జూనియర్ దూరం!

హైదరాబాద్ లోని కుకట్ పల్లిలో నేడు జరిగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు.  ఈ విషయాన్ని ఆయన ప్రతినిధులు అధికారికంగా తెలియజేశారు. నేడు జూనియర్ ఎంటీఆర్ జయంతి, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో పాటు ఫ్యామిలీ తో గడపాల్సి ఉన్నందున జూనియర్ హాజరు కావడం లేదని, ఈ విషయాన్ని ఆహ్వానం అందించిన  సమయంలోనే కమిటీకి  దీనిపై సమాచారం ఇచ్చారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, నేడు జరిగే కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గౌరవ అతిథిగా హాజరు కానుండగా, టిడిపి అధినేత చంద్రబాబు,  సిపిఐ  ప్రధాన కార్యదర్శి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి, కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొనబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular