Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND Vs. IRE: తొలి టి 20 లో ఇండియా (DLS) విజయం

IND Vs. IRE: తొలి టి 20 లో ఇండియా (DLS) విజయం

ఐర్లాండ్ తో  డబ్లిన్ లోని ది విలేజ్ వేదికగా  జరిగిన తొలి వన్డేలో ఇండియా డక్ వర్త్ లూయీస్ (DLS) పద్ధతిలో  2  పరుగులతో విజయం సాధించింది.  టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. నాలుగేళ్ల తరువాత మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న బుమ్రా  తొలి ఓవర్లోనే సత్తా చాటి రెండు వికెట్లు పడగొట్టాడు.  బుమ్రాతో పాటు రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ కూడా రాణించడంతో 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బ్యారీ మెక్ కార్తీ 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51; కర్టిస్ కాంపర్-39; మార్క్ అడైర్- 16 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

లక్ష్య సాధనలో ఇండియా  46  పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్-24; తిలక్ వర్మ(డకౌట్) ల వికెట్లు కోల్పోయింది.  మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్-19; సంజూ శామ్సన్-1 పరుగులతో క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 47 వద్ద వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ ను కొనసాగించే అవకాశం లేకపోవడంతో డిఎల్ఎస్ ద్వారా ఇండియాను విజేతగా ప్రకటించారు.

బుమ్రా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

మూడు వన్డేల సిరీస్ కోసం బుమ్రా సారధ్యంలో ఐర్లాండ్ లో పర్యటిస్తోంది. రెండో వన్డే రేపు ఇదే వేదికలో జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్