Tuesday, June 9, 2026
Homeసినిమాస‌మంత ఎందుకు రాలేదో తెలుసా?

స‌మంత ఎందుకు రాలేదో తెలుసా?

Samantha:  సెన్సేష‌నల్ హీరో విజయ్‌ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్స‌వంలో డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తో పాటు హరీష్‌ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే.. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తున్న స‌మంత మాత్రం ప్రారంభోత్స‌వానికి రాలేదు. దీంతో స‌మంత ఎందుకు ఓపెనింగ్ కు రాలేదు అనేది ఆస‌క్తిగా మారింది. సోష‌ల్ మీడియాలో దీని గురించి చర్చ జ‌రిగింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మంత ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ట్రిప్‌లో ఉందట‌. ఈ కారణంగానే ఈ మూవీ లాంచ్‌ ఈవెంట్‌కు స‌మంత రాలేద‌ని సమాచారం. మ‌హాన‌టి సినిమాలో జంట‌గా న‌టించిన‌ విజ‌య్, స‌మంత ఇప్పుడు మ‌రోసారి జంట‌గా న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read :విజయ్ దేవరకొండ, సమంత చిత్రం ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular