కరోనాతో ఉన్న ఉద్యోగాలు పోయి దేశం అల్లాడుతున్న వేళ- ఒక ఆశ చిగురించినట్లు చల్లటి వార్త. రెండో దశ లాక్ డౌన్లు నెమ్మదిగా ఎత్తేస్తుండడంతో కొత్తగా వైట్ కాలర్ ఉద్యోగాలు దాదాపు 3 లక్షల దాకా భర్తీ కానున్నాయి. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ మహానగరాల్లోనే ఈ కొత్త ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఇందులో ఎక్కువ భాగం సర్వీసు రంగం ఉద్యోగాలే. మార్కెట్లో ఈ మాత్రం కొత్త ఉద్యోగాలు భర్తీ కావడం శుభసూచమని నిపుణులు చెబుతున్నారు. మూడో వేవ్ రాకపోతే నెమ్మదిగా ఉద్యోగాల భర్తీ మరింత వేగం పుజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.