Sunday, January 19, 2025
Homeసినిమావాయిదాప‌డిన వ‌ర్మ మా ఇష్టం మూవీ.

వాయిదాప‌డిన వ‌ర్మ మా ఇష్టం మూవీ.

Not ‘Mee Ishtam’: వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘మా ఇష్టం’. బోల్డ్ సన్నివేశాలతో నిండిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఒక లెస్బియన్ డ్రామా. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ చిత్రం రేపు విడుదల కావాల్సి ఉంది. అయితే.. దేశంలోని ప్రధాన మల్టీప్లెక్స్ చైన్‌లు ఇది సున్నితమైన కంటెంట్ కారణంగా సినిమాను థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శించ‌బోమని చెప్ప‌డం జ‌రిగింది.
ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ… “మా ఇష్టం సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ కార‌ణంగా చాలా ధియేటర్లు కో ఆపరేషన్ లేక‌పోవ‌డంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ఆత‌ర్వాత మా ఇష్టం చిత్రం విడుదల తేదీ ఎప్పుడు అనేది తెలియ చేస్తాను” అని వ‌ర్మ అన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్