Monday, July 20, 2026
Homeసినిమావ‌ర్మ తాజా సంచ‌ల‌నం.. కేసీఆర్ బ‌యోపిక్

వ‌ర్మ తాజా సంచ‌ల‌నం.. కేసీఆర్ బ‌యోపిక్

KCR Biopic: సంచ‌ల‌న‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పు డూ ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటుంటారు. రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి,  కొండా.. ఇలా బ‌యోపిక్ లు తెర‌కెక్కించడంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్ప‌చ్చు. తాజాగా మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా ప్ర‌క‌టించి మ‌రోసారి వార్తల్లో నిలిచారు. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

వర్మ ప్రస్తుతం ‘డేంజరస్’ అనే మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బయోపిక్ త్వరలో తీస్తాను. ఇప్పటికే బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్టు రెడీ గా ఉంది. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెడతాను అని చెప్పారు. అంతే కాకుండా ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇక ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తనకు బాగా నచ్చింది అన్నారు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ బయోపిక్ లో ఎవ‌రు న‌టిస్తారో..? ఈ బ‌యెపిక్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Also Read : ఏప్రిల్ 8న వర్మ ‘మా ఇష్టం’ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular