Monday, June 8, 2026
Homeసినిమాఏప్రిల్ 8న వర్మ 'మా ఇష్టం'

ఏప్రిల్ 8న వర్మ ‘మా ఇష్టం’

Maa Ishtam: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులుగా, సుప్రీం కోర్టు సెక్షన్ 377 రద్దు చేసిన తర్వాత ఇండియా లో మొట్ట మొదటి లెస్బియన్ నేపథ్యం లో క్రైమ్ డ్రామా గా “మా ఇష్టం” చిత్రం రూపొందింది. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 8వ తారీఖున‌ థియేటర్లలో ఈ చిత్రం విడుదల చేయ‌నున్న‌ట్టుగా చిత్ర బృందం ప్రకటించింది.

అబ్బాయి, అమ్మాయి మధ్య కాకుండా, ఇద్దరు అమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది అన్న థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రం గా మన ముందుకి రాబోతోంది. ఈ మూవీ స్టిల్స్ బోల్డ్ గా ఉండ‌డంతో హాట్ టాపిక్ గా మారాయ‌ని చెప్ప‌చ్చు. మ‌రి.. వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నానికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular