Thursday, April 25, 2024
HomeTrending Newsశని, ఆదివారాల్లో కూడా విఐపి బ్రేక్ రద్దు

శని, ఆదివారాల్లో కూడా విఐపి బ్రేక్ రద్దు

No VIP Break: శని, ఆదివారాల్లో విఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శుక్రవారం నాడు విఐపి బ్రేక్ ను రద్దు చేసిన టిటిడి ఇప్పుడు వారాంతంలో మిగిలిన రెండ్రోజులు కూడా రద్దు చేయడం సామాన్య భక్తులకు మేలు చేసే నిర్ణయంగా చెప్పవచ్చు. దీని వల్ల రోజుకు రెండు గంటలపాటు అదనంగా సామాన్య భక్తులు సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకువే అవకాశం కలుగుతుంది.

మరోవైపు, సామాన్య భక్తులకు కేటాయించే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలన్న ఆలోచనే లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కేవలం సిఫారసు లేఖల ఆధారంగా విచక్షణ కోటాలో వీఐపీలకు కేటాయించే సేవా టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగిందని, దీనిపై కూడా తుది  నిర్ణయం తీసుకోలేదన్నారు. ధనవంతుల ప్రయోజనాలను పరిరక్షించే కుట్రతోనే కొందరు ఈ చర్చను వక్రీకరించి  దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక మండలి సమావేశాలు పారదర్శకంగా ఉండాలనే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు.

చర్చ ప్రారంభంలోనే సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడంలేదని తాను స్పష్టంగా చెప్పిన మాటలు విమర్శకులకు వినిపించకపోవడం తమ తప్పు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని అభిప్రాయం కలిగించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాలని కోరారు. తమ మాటలను ఎడిట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్