Sunday, May 26, 2024
HomeTrending Newsరష్యా కట్టడికి భద్రతామండలి సమావేశం

రష్యా కట్టడికి భద్రతామండలి సమావేశం

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధ విమానాల దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంలో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిరసనకు దిగగా మరికొందరు రష్యాతో పోరాడేందుకు ప్రభుత్వం సమకూర్చిన ఆయుధాలతో యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. రష్యా హెచ్చరికలతో గత మూడు నెలల నుంచే బంకర్ లు(నేల మాలిగలు) నిర్మించటం జరిగింది. ఎక్కువ మంది తగిన ఆహార సామాగ్రితో బంకర్లలో తలదాచుకోగా కొందరు సబ్ వే ల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అనేక మంది పొరుగు దేశాలకు పయనమయ్యారు. రెండు వైపులా ప్రాణ నష్టం జరుగుతోంది. ఎంతమంది చనిపోయారు అనే విషయంలో రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఎవరికీ వారే ప్రకటనలు చేస్తున్నారు. కీవ్ నగరంలో చాలా చోట్ల స్మశాన వాతావరణం నెలకొంది.

Un Security Council Ukraine

రష్యా లాంటి పెద్ద దేశం దండయాత్ర చేస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్క వెనక్కి తగ్గడం లేదు. అండగా ఉంటామని హామీ ఇచ్చిన అమెరికా, నాటో దళాలు పట్టించుకోకపోయినా ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు, 4 కోట్ల మంది ప్రజల కోసం తానే స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు. సైనికులను ముందుండి నడిపిస్తున్నారు, దేశం కోసం పోరాడే వారందరికీ ఆయుధాలు ఇస్తామని ప్రకటింవచి, ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.

ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నా… అమెరికా, యూరోప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యాలో చలనం లేదు. రష్యాను కట్టడి చేసేందుకు ఈ రోజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం అవుతోంది. సభ్యదేశాలు అన్ని వ్యతిరేకంగా వోటు వేసినా రష్యాకు వీటో హక్కు ఉన్నందున అది అమలులోకి వచ్చే అవకాశం లేదు. తీర్మానంలో ఏ అంశాలు పొందుపరుస్తారు, సమావేశంలో వివిధ దేశాల అభిప్రాయాలు తెలుసుకున్నాక భారత్ వైఖరి వెల్లడిస్తామని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్ల తెలిపారు.

అగ్ర దేశాల అవసరాలకే అన్నట్టుగా యుఎన్ ఎలాంటి సమావేశాలు నిర్వహించినా నిరుపయోగమనే చెప్పాలి. అమెరికా గల్ఫ్ దేశాలపై దాడులు చేసినా…. చైనా టిబెట్ ను ఆక్రమించినా.. జింజియాంగ్ రాష్ట్రంలో మానవ హననం చేస్తున్నా.. దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఫ్రాన్స్  అరాచకాలు చేస్తున్నా భద్రతా మండలి చోద్యం చూడటం తప్పితే… సద్దాం హుస్సేన్ లాంటి నిస్సహాయులకు…ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న దాఖలాలు లేవు. ఇన్నాళ్ళు యుఎన్ భద్రతామండలి అమెరికా కుట్ర రాజకీయాలకు వేదికైంది. ఇప్పుడు రష్యా కూడా నేటి సమావేశంలో భద్రతామండలిని అపహాస్యం చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

Also Read : రష్యా చక్రబంధంలో ఉక్రెయిన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్