Monday, June 17, 2024
Homeస్పోర్ట్స్మార్చి 26 నుంచి  ఐపీఎల్ షురూ

మార్చి 26 నుంచి  ఐపీఎల్ షురూ

IPL-2022: ఐపీఎల్ -2022 సీజన్ మార్చి నెల 26న ప్రారంభం కానుంది.  ఈ మ్యాచ్ లను ముంబై, పూణే వేదికలుగా నిర్వహిస్తారు. నిన్న జరిగిన బిసిసిఐ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్  బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.  మొత్తం పది టీమ్ లు పాల్గొంటున్న ఈ టోర్నీ లో 70 లీగ్ మ్యాచ్ ల్లో 55 ముంబై,  15 పూణే నగరాల్లో నిర్వహించనున్నారు. ముంబై లోని వాంఖడే, బ్రజౌర్న్, డీవై పాటిల్…. పూణేలోని గహంజే స్టేడియాల్లోఈ మ్యాచ్ లు జరుగుతాయి. అహ్మదాబాద్ లోని స్టేడియం లో కూడా మ్యాచ్ లు నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఆ మేరకు ఫైనల్ షెడ్యూల్ విడుదల చేస్తామని పటేల్ తెలిపారు.

ప్రేక్షకులను అనుమతించే విషయంలో కూడా తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు. 40 శాతం అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించినా కరోనా తగ్గుముఖం పడితే దానికనుగునంతా వీలైనంత ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని కూడా బిసిసిఐ భావిస్తున్నట్లు తెలిపారు.

మార్చి 26 న మొదలుకానున్న ఈ మెగా టోర్నీ మే 29న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్