Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్కివీస్ తో రెండో టెస్ట్: సౌతాఫ్రికా 238/3

కివీస్ తో రెండో టెస్ట్: సౌతాఫ్రికా 238/3

NZ-RSA 2nd Test: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సౌతాఫ్రికా మలి టెస్టులో నిలకడగా రాణిస్తోంది. సరేల్ ఎర్వీ సెంచరీ తో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రెండు టెస్టుల సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  తొలి టెస్టులో  కివీస్ బౌలర్ మాట్ హెన్రీ దెబ్బకు ఇన్నింగ్స్, 276పరుగులతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది.

క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో నేడు మొదలైన రెండో టెస్టు మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకుంది. కెప్టెన్ డీన్ ఎల్గర్- ఎర్వీలు మొదటి వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  ఎల్గర్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్ క్రమ్-ఎర్వీలు రెండో వికెట్ కు 88 జోడించారు. మార్ క్రమ్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్ ద్వారానే టెస్ట్ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన ఎర్వీ తన తొలి సిరీస్ లోనే సెంచరీ (108) సాధించి హెన్రీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆట ముగిసే సమయానికి తెంబా బావుమా-22;  రస్సీ వాందర్ దస్సేన్-13 పరుగులతోను క్రీజులో ఉన్నారు.  కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, మాట్ హెన్రీ, నీల్ వాగ్నర్ తలా ఒక వికెట్ సాధించారు.

Also Read : మార్చి 26 నుంచి  ఐపీఎల్ షురూ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular