Sunday, January 19, 2025
HomeTrending NewsRail tragedy : దేశ చరిత్రలోనే విషాదం

Rail tragedy : దేశ చరిత్రలోనే విషాదం

ఒడిశా రైలు ప్రమాదం దేశ చరిత్రలోనే విషాదంగా నిలిచింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్గొంటుంది. క్షతగాత్రులకు భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంజ్, కటక్ లోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే గతంలో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఒకటి కాదు..మూడు రైళ్లు కొట్టుకున్నాయి.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..దానికి కారణాలేంటి..

బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి  7 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అయితే అదే ట్రాక్ పై 120 కిలో మీటర్ల వేగంతో వస్తున్న షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను  ఢీకొట్టింది. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు ఒక్కసారిగా బోల్తాపడ్డాయి.  బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది.

మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో బోగీలు  ఎగిరిపడ్డాయి. అందులోని  ప్రయాణికులు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్