Sunday, June 14, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన ఆశా మాలవ్య

సిఎంను కలిసిన ఆశా మాలవ్య

ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆమె సైకిల్‌పై దేశాన్ని చుట్టి వస్తున్న యాత్రలో ఉన్నారు. దీనిలో భాగంగా ఆమె ఏపీలో పర్యటిస్తున్నారు.  ఆశా మాలవ్యను  సిఎం జగన్  ప్రత్యేకంగా అభినందించారు. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్క్షషిస్తూ 10 లక్షల  రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి ఆశా మాలవ్య వివరించారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే  సీఎం జగన్‌ను కలిశారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular