Friday, June 12, 2026
Homeసినిమాఆషిక రంగనాథ్ హవా మొదలైనట్టే! 

ఆషిక రంగనాథ్ హవా మొదలైనట్టే! 

ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి ఎక్కువమంది కథానాయికలు టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. తమిళ .. మలయాళ భాషల నుంచి వచ్చిన బ్యూటీలతో వీరు పోటీ పడుతున్నారు. అలా కన్నడ నుంచి వచ్చిన రష్మిక ప్రస్తుతం టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది. ఇప్పుడు కన్నడ నుంచి మరో అందాల భామ ఆషిక రంగనాథ్ ‘అమిగోస్‘ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ననే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది.

ప్రతి హీరోయిన్ కూడా ఫస్టు సినిమా తప్పకుండా హిట్ కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే అప్పుడు లభించే గుర్తింపు .. వచ్చే అవకాశాలు వేరుగా ఉంటాయి. అందువల్లనే ఫస్టు హిట్ కోసం అంతా కలలు కంటూ  ఉంటారు. అలాంటి ఫస్టు హిట్ ఆషిక రంగనాథ్ ఎకౌంట్ లో పడిపోయింది. ఆమె నటించిన ‘అమిగోస్’ తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కల్యాణ్ రామ జోడీగా ఈ సినిమాలో ఆమె క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. పెద్దగా మేకప్ అవసరం లేకుండానే చక్కని స్కిన్ టోన్ తో ఆశ్చర్యపరిచింది.

నిజానికి ‘అమిగోస్’ సినిమాలో ఆషిక పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. టెన్షన్ తో ఉన్న హీరోకు ఆమె సపోర్ట్ కూడా ఏమీ ఉండదు. ముగ్గురు కల్యాణ్ రామ్ ల మధ్య ఆమెకి లభించిన స్పేస్ చాలా చిన్నది. అందువలన  తెరపై అప్పుడప్ప్పుడు మాత్రమే కనిపించింది. అయినా తన అందచందాలతో కట్టిపడేసింది. ఆకర్షణీయమైన రూపంతో అందరి మనసులను కొల్లగొట్టేసింది. ఈ సినిమాతో హిట్ తో ఈ బ్యూటీ కి వరుస ఆఫర్లు రావడం ఖాయమే .. ఈ సినిమాతో ఆమె హవా మొదలైనట్టే!

Also Read: అమిగోస్ పై ఎన్టీఆర్ స్పందన ఏంటో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular