ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆశ్లే బార్టీ ఈ ఏడాది వింబుల్డన్ విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన కరోలినా ప్లిస్కోవా పై 6-3, 6-7,6-3 తేడాతో విజయం సాధించి తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుంది. 25 ఏళ్ళ బార్టీ , 29 ఏళ్ళ ప్లిస్కోవాతో తలపడ్డ గత మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది, నేటి వింబుల్డన్ ఫైనల్ తో నాలుగో మ్యాచ్ లో కూడా బార్టీ విజయం సాధించి తనదే పైచేయి అనినిరూపించుకున్నారు.
2011 లో వింబుల్డన్ జూనియర్ టైటిల్ ను బార్టీ గెల్చుకుంది, పదేళ్ళ తరువాత సీనియర్ విమెన్ సింగిల్స్ టైటిల్ ను కూడా గెల్చుకుని రికార్డు సొంతం చేసుకుంది. 1980 తరువాత వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్న ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా కూడా ఆమె ఖ్యాతి సంపాదించింది.
ఈ విజయంతో బార్టీ 23,99,520 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ సంపాదించింది. భారత కరెన్సీ లో ఇది 17 కోట్ల 87 లక్షల రూపాయలు.