Thursday, June 11, 2026
Homeసినిమాసంక్రాంతికి వస్తున్న గల్లా ‘హీరో’

సంక్రాంతికి వస్తున్న గల్లా ‘హీరో’

Ashok Galla-Hero: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ‘హీరో’ చిత్రంతో టాలీవుడ్ లో కథానాయకుడిగా అడుగు పెడుతున్నారు అశోక్ గల్లా. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో సినిమా ఈ నెల 15న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదల కాబోతోంది. అశోక్‌ గల్లా కు హీరో మొదటి చిత్రమే అయినా ఎంతో మెచ్యూర్డ్ గా నటించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

యాక్టింగ్ తో పాటు లుక్స్ తో అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ రోల్‌లో అశోక్‌ గల్లాను హీరో చిత్రంలో చూడబోతున్నామని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య టాలెంటెడ్ డైరెక్టర్. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఈ కాంబినేషన్ పై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘హీరో’ సినిమా సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. జనవరి 15న తాము ఆశించిన విజయం దక్కుతుందనే పూర్తి నమ్మకంతో ఉంది హీరో మూవీ టీమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular