Monday, March 16, 2026
Homeసినిమామే 6న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’

మే 6న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’

Kalyanam date fixed: ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను మే6 విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ప్ర‌మోష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా చేస్తున్నాం. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.  విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా హిలేరియ‌స్‌గా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి సూప‌ర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం.

Also Read : అశోక వనంలో. ‘రామ్ సిలక’ పాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular