Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Ram Silaka:
‘‘ఉరికే నా సిల‌కా నీ స‌క్క‌నైన పాట మెళిక‌
గ‌ట్టు దాటి పుట్ట దాటి.. ఏడేడు ఏర్లు దాటి
కొండా దాటి కోన దాటి .. కోసు కోసు దార్లు దాటి
సీమా సింత నీడ‌కొచ్చానె రంగు రంగు రామ్ చిల‌క సింగ‌రాల సోకులు చూశానె’’
అని అల్లం అర్జున్ కుమార్ తనకు కాబోయే భార్య గురించి పాట పాడుకుంటున్నారు. అసలు.. ఇంతకీ అల్లం అర్జున్ కుమార్ ఎవ‌రు?  అత‌ని బాధేంటి.? అనే విష‌యం తెలియాలంటే… ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

ఫ‌ల‌క్‌నుమా దాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న‌ విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ‘రామ్ చిలక..’ అనే పాటను రిలీజ్ చేశారు.

జె క్రిష్ సంగీతం అందించిన ఈ పాటను విజయ్ కుమార్ భల్లా, రవి కిరణ్ కోలా రాశారు. రవి కిరణ్ కోలా పాటను పాడారు. జానపదం స్టైల్లో పాట ఉంది. ఇందులో విశ్వక్ సేన్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన పాట‌ల‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ  ‘రాజా వారు రాణి గారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి  విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com