7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమాటాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. నిర్మాత అరెస్ట్.. డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు లీక్?

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. నిర్మాత అరెస్ట్.. డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు లీక్?

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం సంచలనం రేపింది. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన డ్రగ్స్ డీలర్‌ కేపీ చౌదరీని విచారించగా సినీ తారల భాగోతం బయటపడింది. టాలీవుడ్‌ను డ్రగ్స్ ప్రకంపనలు మరోసారి వణికిస్తున్నాయి. పోలీసుల విచారణలో భారీగా సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం వివరాల్లోకి వెళితే..సెలబ్రెటీలు, నేతల కుమారులకు కెపి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు పేర్కొన్నారు. కెపి కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేస్తుండటంతో పలువురి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. సినీ నటి ఆషురెడ్డి, మరో ఆర్టిస్టుతో అతను వందలాది కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు.

కెపి కాల్ లిస్ట్‌లో రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్, సుశాంత్ సాయిప్రసన్న, రాకేష్ రోషన్, రతన్‌రెడ్డి , ఒంటేరు పనవ్‌రెడ్డి, అనురూప్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో 12 మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కెపి ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో అతని బ్యాంక్ లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా 11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు తెలిసింది. అయితే విచారణకు ముందు కెపి చౌదరి వాదన మరోలా ఉంది తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, సెలబ్రిటీలు ఎవరికీ నేను డ్రగ్స్ అందించ లేదన్నారు. ఫోన్‌లో నెంబర్లు ఉన్నంత మాత్రాన డ్రగ్స్ అమ్మినట్టా? అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్