హీరో అశ్విన్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్ నటిస్తోన్న లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. అనీల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్(ఎస్.వి.కె.సినిమాస్) బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇతిహాసాల్లో శక్తివంతమైన రాక్షసరాజు పేరే హిడింబ. పోస్టర్‌లో హీరో లుక్ చూస్తుంటే ఈ సినిమా టైటిల్ పక్కాగా సరిపోయేలా ఉందనిపిస్తుంది. ఈ సినిమా కోసం అశ్విన్ బాబు మేకోవర్ అయ్యాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సినిమా ఇప్పటికే యాబై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. బి.రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్న ఈ చిత్రానికి వికాస్ బడిసా సంగీతాన్ని అందిస్తున్నారు.