Saturday, April 20, 2024
Homeసినిమాఆగస్టు 13న పూర్ణ ‘సుందరి’ విడుదల

ఆగస్టు 13న పూర్ణ ‘సుందరి’ విడుదల

తెలుగులో భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న నటి పూర్ణ ప్రధాన పాత్రలో, అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మేంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఆదివారం చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో అర్జున్, రాకేందు మౌళి, నిర్మాత రిజ్వాన్, దర్శకుడు కళ్యాణ్ జి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఖుషి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ… చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే.. సుందరి సినిమా థియటర్స్ లో విడుదల అవుతుంది. ఆగస్టు 13 అంటే ఇప్పటి నుండే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంత కంఫర్టబుల్ గా ఈ సినిమా చేయడానికి కారణం నా టీం. ఇది నా టీమ్ కాదు ఫ్యామిలీ అని చెప్పాలి. ఇక నిర్మాత గారు నన్ను లీడ్ రోల్ లో పెట్టి ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. స్టార్ హీరోయిన్స్ రేంజ్ చేసే పాత్ర ఇది .. నేను ఇంకా ఆ రేంజ్ కి రాలేదు .. కానీ నా మీద నమ్మకంతో నిర్మాత దర్శకుడు నమ్మకం పెట్టి ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను”  అన్నారు.

:నాకు నయనతార గారు ఇన్స్పిరేషన్ .. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది. ఇక దర్శకుడు కళ్యాణ్ గారు చాలా ప్యాషన్ తో సినిమా చేస్తారు. నిజంగా చాలా మంచి వ్యక్తి అయన. అలాగే రాకేందు మౌళి గురించి చెప్పాలంటే తాను చాలా టాలెంటెడ్ పర్సన్.. అతనితో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను, అతను నాకు టీచర్ లా అనిపించాడు. ఇక అర్జున్ గారు చాలా స్మార్ట్ .. అయన వర్క్ లో కూడా అంతే స్మార్ట్ గా ఉంటారు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా కొత్త తరహాలో ఉంటుంది .. అందరికి తప్పకుండా నచ్చేలా ఉంటుంది. మీరంతా ఈ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్